ఓట్సార్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన ఐక్యూబ్ ఈ- కార్యాలయంతో సంబంధాలు భావితరాలకు ఉపయోగపడుతాయని ఆసంస్థ తెలిపింది.
ఐక్యూబ్ ఈ- కార్యాలయాన్ని ఓట్సార్ టెక్నాలజీస్ సంస్థ చెన్నైలో సోమవారంనాడు ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ ఎమ్‌డీ సామ్యూల్ మార్టిన్ మాట్లాడుతూ... తమ సంస్థ అన్ని రకాల సేవలను అందిస్తుందని, భావితరాలవారికి తమ ఐక్యూబ్ కార్యాలయం ఎంతో ఉపయోగపడగలదని ఆయన తెలిపారు.
ప్రస్తుతం టెక్నాలజీ రంగం చాలా అభివృద్ధి చెందిందని, ఇంట్లోనే కూర్చొని అన్ని రకాల పనులను చేయవచ్చని, దీంతోపాటు ఇంట్లోనే కూర్చుని అన్నిరకాల వార్తా పత్రికలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చని ఆయన వివరించారు.
కంప్యూటర్లను వాడేటటువంటి ప్రధాన సంస్థలకు అనుకూలంగా సేవలను అందిస్తుందని, దేశంలోని పెద్ద పెద్ద సంస్థలలో తాము సేవలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. హోమ్‌పేజ్, కంప్యూటర్‌కు సంబంధించిన పలు చిత్రాలు, చాటింగ్, అధికారికమైన మీటింగ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు తమ సంస్థ అందించే పరికరాలతో పలు సంస్థలు ఉపయోగించుకోలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము అందించే సరికొత్త వెబ్ డిజైన్, త్రీడీ ఇమేజ్, ఆన్‌లైన్ స్టోర్లలోని సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చని, అలాగే ఇండ్లలోను ఇంటర్నెట్ సదుపాయంతో తమ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయుడు ఆనంద్ పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేశారు.