ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » క్యోసెరా వైర్‌లెస్ ఇండియా మైండ్‌ట్రీ హస్తగతం (Kyocera Wireless India | MindTree | acquire | San Diego | KWC)
శాన్‌డీగో కేంద్రంగా పనిచేస్తున్న మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ క్యోసెరా వైర్‌లెస్ కార్పొరేషన్ (కేడబ్ల్యూసీ) అనుబంధ సంస్థను ఐటీ సొల్యూషన్స్ సంస్థ మైండ్‌ట్రీ కైవసం చేసుకుంది. బెంగుళూరులో కేడబ్ల్యూసీ అనుబంధ సంస్థ ఉంది. ఈ ఒప్పందం కింద.. మైండ్‌ట్రీ సంస్థ.. కేడబ్ల్యూసీ సంస్థకు 6 మిలియన్ డాలర్లను చెల్లించింది.
ఇక తదుపరి చెల్లింపులు .. 2010-11 మరియు 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చే ఆదాయలతో సంబంధం కలిగి ఉంటాయని మైండ్‌ట్రీ తన ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో.. అక్టోబర్ 2009 నుంచి మార్చి 2010 మధ్యలో ఆదాయం 9 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు మైండ్‌ట్రీ అంచనా వేస్తోంది.
కాగా, మైండ్‌ట్రీ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ నటరాజన్ మాట్లాడుతూ, క్యోసెరా అనుబంధ సంస్థను కొనగోలు మరియు దానితో తమ కంపెనీ అనుబంధంతో.. అంతర్జాతీయ పీఈఎస్ మార్కెట్లో మైండ్‌ట్రీ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేయగలదన్నారు. ప్రస్తుతం క్యోసెరా వైర్‌లెస్ టెక్నాలజీస్ (కేడబ్ల్యూఐ)లో 600 మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వైర్‌లెస్ ప్రాడక్ట్ డెవలెప్మెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కేడబ్ల్యూసీల ప్రాడక్ట్ టెస్టింగ్ తదితర విభాగాలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కేడబ్ల్యూఐ.. మైండ్‌ట్రీ హస్తగతమైనప్పటికీ.. గతంలోలానే శాన్‌డీగో ఆధారిత కేడబ్ల్యూసీ మరియు ఇతర క్యోసెరా సంస్థలకు ఇంజినీరింగ్ సేవలను కాంట్రాక్ట్ ఆధారంగా యథావిధిగా నిర్వర్తిస్తుంది.