ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » సింగపూర్ సంస్థతో టీసీఎస్ ఔట్‌సోర్సింగ్ డీల్ (TCS | Outsourcing deal | Peoples Association Management service | Singapore firm | Girija Pande)
 
సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. బుధవారం.. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసు (ఏఎంఎస్)తో రెండు సంవత్సరాల మల్టీ మిలియన్ డాలర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సింగపూర్ కమ్యూనిటీ డెవలెప్మెంట్, యూత్ మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థే ఈ పీపుల్స్ అసోసియేషన్.

కాగా, ఈ ఒప్పందం కింద టీసీఎస్.. పీపుల్స్ అసోసియేషన్ వ్యాపార మరియు సిటిజెన్ సెంట్రిక్ అప్లికేషన్స్, క్లిష్టమైన అప్లికేషన్ సమస్యలు వంటి వాటిని డెవలప్ మరియు నిర్వహణ కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. టీసీఎస్ ఆసియా-పసిఫిక్ ఈవీపీ మరియు ప్రధాన అధికారి గిరిజా పాండే మాట్లాడుతూ, ఏఎంఎస్‌తో టీసీఎస్ ఒప్పందంపై వివరించారు.

తమ సంస్థ సామర్థ్యంతో.. మంచి ఫలితాలను రాబడతామన్నారు. 20 ఏళ్ల కాలంలో సింగపూర్‌లో టీసీఎస్ సంస్థ బాగా విస్తరించిందన్నారు. ఇప్పటికే టీసీఎస్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్, సిటీ బ్యాంక్ ఆసియా పసిఫిక్ మరియు జనరల్ ఎలక్ట్రిక్ వంటి 30 మంది ప్రధాన కస్టమర్లు ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.