ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » బీఎస్ఎన్ఎల్‌తో టాటా టెలీ భాగస్వామ్య ఒప్పందం (BSNL | Tata Tele Service | Sharing deal | Infrastructure | 15 years)
ప్రముఖ దేశీయ టెలికాం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌తో టాటా టెలీ సర్వీసెస్ సంస్థ మౌళికసదుపాయాల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉన్న మౌళికసదుపాయాలను టాటా టెలీ సర్వీసెస్‌కు అందించాల్సి ఉంటుంది.
ఈ భాగస్వామ్య ఒప్పందంతో ప్రైవేటు సంస్థ అయిన టాటా టెలీ సర్వీసెస్ జీఎస్ఎం నెట్‌వర్క్ విస్తరణకు ఎంతగానో ఉపయోగపడనుంది. బీఎస్ఎన్ఎల్‌తో 15 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం టాట్ టెలీ సర్వీసెస్ ఈ విషయాలను వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్‌తో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం తమ సంస్థకు ఎంతో గర్వకారణంగా టాటా టెలీ తెలిపింది. బీఎస్ఎన్ఎల్‌తో ఇలాంటి ప్రత్యేకమైన మరియు కీలకమైన ఒప్పందాన్ని చేసుకున్న తొలి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌గా తమ సంస్థ నిలిచిందన్నారు.
అలాగే ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా తమ టాటా టెలీ నెట్‌వర్క్ వేగవంతంగా విస్తరించగలదన్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలను టాటా టెలీ వెల్లడించలేదు. కాగా, ప్రస్తుతం టాటా టెలీ.. టాటా డొకోమో బ్రాండ్ పేరిట జీఎస్ఎం మొబైల్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
గత మూడు నెలల్లో మొత్తం తొమ్మిది సర్కిల్‌లో జీఎస్ఎం సేవలను టాటా టెలీ అందిస్తోంది. వాటిల్లో తమిళనాడు, కేరళ, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ముబై, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు హర్యానాలు ఉన్నాయి.