ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » మొబైల్ ఫోన్‌ల రంగంలోకి వీడియోకాన్ (Videocon | Mobile Phone sector | Elcoteq | Electronic Products | Buying contract)
 
గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా పేరొందిన సంస్థల్లో ఒకటైన వీడియోకాన్ సంస్థ.. త్వరలో మొబైల్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్కోటెక్‌ కంపెనీని వీడియోకాన్ కొనుగోలు చేసింది.

ఈ కొనుగోలు ఒప్పందం కింద వీడియోకాన్.. 73 మిలియన్ అమెరికా డాలర్లను చెల్లించింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి వ్యాఖ్యానించేందుకు వీడియోకాన్ అధికారులు తిరస్కరించారు. ఈ వివరాలను వచ్చే సోమవారం రోజు కంపెనీ వెల్లడిస్తుందని తెలిపారు.

వైర్‌లెస్ టెక్నాలజీలో వృద్ధిని సాధించేందుకు వీడియోకాన్ సంస్థ చేస్తున్న ప్రణాళికల్లో ఈ ఒప్పందం చేసుకుందని ఎల్కోటెక్ తన ప్రకటనలో తెలిపింది. వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ప్రస్తుతం రూ. 15వేల కోట్లు మేరకు ఆదాయం వస్తోంది. కన్‌స్యూమర్ డ్యూరబుల్ బిజినెస్, చమురు మరియు సహజవాయువుల వ్యాపారం నుంచి వీడియోకాన్ గ్రూపుకు ఈ ఆదాయం వస్తోంది.

అలాగే చెన్నైలో ఎల్కోటెక్ ప్లాంట్ ఒకటి ఉంది. దీనికి సుమారు. రూ. 2వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఇందులో 3వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. అంతర్జాతీయంగా ఈ కంపెనీకి గత ఏడాదిలో.. 3.4 బిలియన్ యూరోల మేరకు ఆదాయం వచ్చింది. అయితే ప్రస్తుతం.. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం ఈ ఆదాయంపై ప్రభావం చూపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.