ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » 2013 నాటికి ఐటీ రంగంలో 5.8 లక్షల ఉద్యోగాలు (IT sector | 2013 | Lakhs Jobs | IDC | economic crisis | 3 percent | Microsoft)
 
File
FILE
ఉద్యోగ అవకాశాల యంత్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కొత్త అవతారం దాల్చనుంది. రానున్న నాలుగేళ్లలో ఐటీ రంగంలో సుమారు 5.8 లక్షల మేరకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తన తాజా పరిశోధనల ద్వారా వెల్లడించింది.

అలాగే రానున్న నాలుగేళ్లలో కొత్త వ్యాపార పుంతలు తొక్కి.. కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా.. ఆర్థిక మాంద్యంతో అవస్థలు పడుతున్న దేశాలకు ఆర్థిక శక్తిని అందజేసే ఇంధనంగా మారనున్నట్లు ఐడీసీ తెలిపింది. దీంతో వార్షికంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల రేటు 3 శాతం అదనంగా పెరుగుతుందని వివరించింది.

ప్రధానమైన ఆర్థిక వృద్ధిలో.. వైవిధ్యమైన టెక్నాలజీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఉత్పత్తుల్లో పెరుగుదల, స్థానిక కొత్త వ్యాపారాల సృష్టిని పెంపొందించడం, ఆర్థిక రికవరీకి అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు.. ఆర్థిక వృద్ధికి మద్ధతు వంటి అంశాలకు ఐటీ రంగం ఎంతగానో దోహదపడుతుందని మైక్రోసాఫ్ట చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బామర్ అన్నారు.

ఐడీసీ తన సర్వేలో భాగంగా మొత్తం 52 దేశాల్లో ఐటీపై ఉన్న ప్రభావాన్ని అధ్యయనం చేసింది. ప్రస్తతం ఐటీ వృద్ధి ఆశావహంగానే ఉందని.. నెమ్మదిగా.. ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటోందని మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ అఫైర్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ స్కాట్ సెల్బీ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఉద్యోగాల వృద్ధి రేటుపై చూస్తే.. ఐటీ సంబంధిత ఉద్యోగాలు మూడు రెట్లు బాగున్నట్లు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.