ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » ఆర్‌కామ్ కొత్త టారిఫ్: 'నిమిషానికి 50పైస'ల పథకం (Reliance Communications | New tariff | 50 paise per minute | plan | local | STD)
శరవేగంగా అభివృద్ధి చెందుతన్న భారత టెలికాం మార్కెట్లో టారిఫ్‌ల పోరు కూడా అంతకుఅంత పెరుగుతూ వస్తోంది. మార్కెట్లో ఉన్న పోటీకి ధీటుగా.. అనిల్ అంబానీ గ్రూపు సంస్థ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. నిమిషానికి.. 50 పైసలతోనే కాల్స్ చేసేలా కొత్త పథకాన్ని రూపొందించింది.
జూన్‌లో టాటా డొకోమో బ్రాండ్ పేరు కింద సెకనుకు పైసా చొప్పున వసూలు చేసేలా టాటా టెలీ సర్వీసెస్ తన జీఎస్ఎం సేవలను ప్రారంభించింది. దాని తర్వాత టారిఫ్ రేట్లను కుదిస్తూ.. ముందుకు వచ్చిన కొత్త ఆపరేటర్ ఆర్‌కామ్ అని చెప్పొచ్చు. టాటాను అనుసరిస్తూ... ప్రముఖ మొబైల్ ఆపరేటర్ దిగ్గజం.. భారతీ ఎయిర్‌టెల్ .. లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి 50పైసల టారిఫ్‌ను ప్రవేశపెట్టింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, పర్సనల్ బిజినెస్ నిలంజన్ ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ, రేపటి నుంచి.. భారత వినియోగదారుడు తన నెలవారీ సెల్‌ఫోన్ బిల్‌లో 46 శాతం మేరకు ఆదా చేసుకుంటారని తెలిపారు. ఈ పథకానికి ఎలాంటి షరతులను ఆపాదించలేదన్నారు.
ఈ రిలయన్స్ పథకం.. వన్ టైమ్ స్పెషల్ టారిఫ్ వోచర్‌లా రూ. 48 వద్ద లైఫ్‌టైమ్ వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ వినియోగదారులతో పాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. రిలయన్స్ నుంచి దేశంలోని ఏ ఇతర నెట్‌వర్క్‌కు చెందిన సీడీఎంఏ, జీఎస్ఎం, ల్యాండ్‌లైన్‌ల కైనా ఈ కొత్త కాల్‌రేట్లు వర్తిస్తాయన్నారు.