ఇతర ప్యాకేజీలు లేదా పథకాలతో పాటు సెకనుల లెక్కన కాల్‌కు రుసుమును వసూలు చేసే ప్లాన్ ఆప్షన్‌ను టారిఫ్‌గా అందించవచ్చని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆపరేటర్లను ఉద్ధేశించి వెల్లడించింది. ఇలాంటి తరహా పథకం ఆపరేటర్లకు చక్కటి అవకాశంగా.. ట్రాయ్ ఛైర్మన్ జెఎస్ శర్మ తెలిపారు.
న్యూఢిల్లీలో విలేకరులతో శర్మ మాట్లాడుతూ, సెకెండ్ లెక్కన బిల్లింగ్‌పై ప్రస్తుతం తాము ఓ కన్‌సల్టేషన్ పేపర్లను సిద్ధం చేస్తున్నామన్నారు. వినియోగదారులకు సెకెండ్ బిల్లింగ్ పథకాన్ని అందించాలనే ఉద్ధేశ్యంతో తాము ఇచ్చిన ఉపాయం వెనుక ఉద్ధేశ్యంగా తెలిపారు. సెకెండ్ బిల్లింగ్ కోసం ఇచ్చిన సలహాలపై ఆపరేటర్ల నుంచి వచ్చే ప్రతిస్పందన గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన విధంగా వ్యాఖ్యానించారు.
ఇతర పథకాలతో పాటు ఈ కొత్త పథకాన్ని కూడా ఆపరేటర్లు వినియోగదారులకు అందించవచ్చన్నారు. తాము సెకెండ్ బిల్లింగ్‌పై టారిఫ్‌ను నిర్ధారించడం లేదన్నారు. ఈ విషయంపై సిఫార్సులను పరిగణలోకి తీసుకుని తద్వారా ఆపరేటర్లకు.. అదే విధంగా వినియోగదారులకు గల ఆసక్తిని పరిశీలిస్తామన్నారు.