కూల్‌ప్యాడ్ మొబైల్‌ను ఆవిష్కరించిన రిలయన్స్ వరల్డ్
బుధవారం, 14 అక్టోబర్ 2009( 19:12 IST )
Srini
WD
ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ వరల్డ్ సరికొత్త ఫ్యూచర్స్‌తో కూల్‌ప్యాడ్ డుయల్ మోడ్‌లో కొత్త ఫోన్‌ను తమిళనాడు మార్కెట్‌లోకి విడుదల చేసింది. చెన్నయ్‌లోని రిలయన్స్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమలో ఈ ఆవిష్కరించారు. తమిళనాడులోని అన్ని రిలయన్స్ వెబ్ స్టోర్లతో పాటు... రిలయన్స్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తమిళనాడు రిలయన్స్ వెబ్‌స్టోర్ లిమిటెండ్ సర్కిల్ హెడ్ రాజీవ్ చంద్రవల్లి తెలిపారు.
కూల్‌ప్యాడ్ 2938 పేరుతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర రూ.10,999గా నిర్ణయించారు. సీడీఎంఏ, జీఎస్ఎం సర్వీసెస్ ఫ్యూచర్స్ అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని రిలయన్స్ వెబ్ స్టోర్లలో కూల్‌ప్యాడ్ డ్యుయల్ మోడ్ మొబైల్స్ 30 శాతం మేరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ మొబైల్ ఫోన్‌లో స్టీరియో ఎఫ్ఎం, త్రీడీ సౌండ్ టెక్నాలజీ, మల్టీమీడియా ప్లేయర్, 2జిబి మెమరీ పవర్, టచ్ ప్యానల్, బిజినెస్ అప్లికేషన్స్, 20 మెగా పిక్సల్ కెమెరా, బ్లూ టూత్, వాయిస్ రికార్డింగ్, ఫ్రీక్వెన్సీ, హై సామర్థ్యం కలిగిన బ్యాటరీ, మూడు గంటల టాక్ టైమ్ తదితర సౌకర్యాలు కలిగివుంది.
దీనిపై రాజీవ్ చంద్రవళ్లి మాట్లాడుతూ.. నాణ్యవంతమైన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తమిళనాడు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారన్నారు. తాము తాజాగా ప్రవేశపెట్టిన కూల్‌ప్యాడ్ డ్యుయల్ మోడ్ స్మార్ట్‌ఫోన్ తమిళనాడు మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.