ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » సీడీఎంఏ మొబైల్‌ల దిగుమతిపై నిషేధం: ప్రభుత్వం (CDMA Mobile | imports | ban | Government | DGFT | ESN | MEID)
ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ సీరియల్ నెంబర్ మరియు మొబైల్ ఎక్విప్మెంట్ గుర్తింపు కలిగి లేని.. సీడీఎంఏ మొబైల్ దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. మొబైల్ ఉపయోగించే వినియోగదారున్ని సులువుగా గుర్తించేందుకు అధికారులకు ఈ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
విదేశీ వాణిజ్య, వ్యాపార డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ సీరిలయన్ నెంబర్ (ఈఎస్ఎన్), మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫయర్ (ఎంఈఐడీ).. అంటే.. ఈఎస్ఎన్/ఎంఈఐడీలో అన్ని సున్నాలు కలిగిన సీడీఎంఏ మొబైల్ ఫోన్ దిగుమతులపై నిషేధం విధించినట్లు ఈ ప్రకటనలో తెలిపింది.
భారత్‌లో ఇప్పటికే.. 100 మిలియన్లకు పైగా సీడీఎంఏ వినియోగదారులు ఉన్నారు. టెలికాం పరిశ్రమ అందించిన వివరాలు ప్రకారం.. ప్రతి నెల 5.8 మిలియన్‌ల మేరకు కొత్త సీడీఎంఏ వినియోగదారులు వస్తున్నారు. కాగా, చాలా వరకు సీడీఎంఏ మొబైళ్ల దిగుమతులు చైనా, థాయ్‌లాండ్ నుంచే అవుతున్నట్లు తెలుస్తోంది.