ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » అలరించిన మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ భాషల ఉత్పత్తులు (MicroSoft | Regional | Computer | Stalls | Chennai | Office | Excell | Products)
ముద్రణ రంగంలో చోటు చేసుకున్న ఆధునిక మార్పులు, ప్రాథమిక అంశాలపై చెన్నయ్‌లో జరిగిన ఓ ప్రదర్శన ఎంతగానే ఆకట్టుకుంది. ప్రధానంగా స్థానిక భాషల కంప్యూటింగ్‌కు విశేష కృషి చేస్తున్న మైక్రోసాఫ్ట్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్టాల్ పలువురి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.
స్థానిక భాషల కంప్యూటింగ్‌కు ఉపయోగపడేలా భారతీయ భాషల్లో రూపొందించిన వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ వంటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003 ఉత్పత్తులను ల్యాప్‌టాప్‌ల ద్వారా ప్రదర్శించి, వాటి పనితీరును వీక్షకులకు కరపత్రాల ద్వారా వివరించారు.
ఆంగ్ల భాషా మాధ్యమంలో మాత్రమే తాము ఉపయోగించుకుంటున్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులను ఇకపై తమ స్వంత భాషల్లోనే ఉపయోగించుకునే వీలుందని ఈ సందర్భంగా వివరించడం గమనార్హం.