ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » ఇక నిమిషానికి 30 పైసలే.. టాటా ఇండికామ్‌లో! (Tata Indicom | 30 paise per minute | Air tel | Tata DOCOMO)
Feedback Print Bookmark and Share
 
టెలికాం ఆపరేటర్ల మధ్య రోజు రోజుకు టారిఫ్ వార్ అంతకు అంతకు పెరుగుతోంది. సెకెను బిల్లింగ్ అంటూ... టాటా డొకొమో వస్తే.. దీనిక ధీటుగా.. ఎయిర్‌టెల్ కూడా సెకెను బిల్లింగ్ ప్రవేశపెట్టింది. ఈ తరుణంలో.. తాజాగా టాటా ఇండికామ్ మరో అడుగు ముందుకు వేసి.. వినియోగదారుల దృష్టిని మరింతగా ఆకట్టుకునేందుకు నిమిషానికి 30పైసల టారిఫ్‌ను ప్రవేశపెట్టింది.

సెలెబ్రేషన్ ప్లాన్ కింద టాటా ఇండికామ్ తాజాగా రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశంలో ఎక్కడికైనా.. అంటే.. లోకల్, ఎస్టీడీ కాల్స్.. ఏ ఆపరేటర్‌కైనా చేసే కాల్స్‌కు నిమిషానికి 30 పైసలు మాత్రమే టాటా ఇండికామ్ ఈ పథకం కింద వసూలు చేస్తుంది.

ముందుగా పేర్కొన్న సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో.. అంటే.. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చేసే ఏ కాల్స్‌కైనా 60 పైసలు వసూలు చేస్తారు. దీనికి టాటా టెలీసర్వీసెస్ ప్రాంతీయ సీఓఓ ఎన్ రామకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న వినియోగదారులే కాకుండా.. కొత్తగా వచ్చే వినియోగదారులు కూడా ఈ పథకాన్ని పొందవచ్చన్నారు.

కొత్తగా కనెక్షన్ తీసుకునేవారు.. రూ. 99తో స్టార్టర్ ప్యాక్ కొనుగోలు చేసి రూ. 9 రీఛార్జ్ వోచర్‌తో కాల్స్ చేయవచ్చన్నారు. అయితే ఇప్పటికే ఉన్న వినియోగదారులు.. రూ. 148 రీఛార్జ్ చేయడం ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.