దేశ ప్రైవేట్ బ్యాకుల్లో ఒకటైన లక్ష్మీ విలాస్ బ్యాంకు మరో రికార్డు సాధించింది. ఐటీ సేవలను వినియోగించడంలో ఇతర బ్యాంకుల కంటే ముందంజలో ఉంది. ఫలితంగా హిటాచ్చి డేటా సిస్టమ్ అందజేసే మోస్ట్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ డైమండ్ అవార్డును సొంతం చేసుకుంది.
దీనిపై ఎల్.వి.బి మేనేజింగ్ డైరకట్ర వీఎస్.రెడ్డి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు తమ బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. తమ ఖాతాదారులకు ఉన్నత సేవలు అందించేందుకు తాము ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. అధునాత టెక్నాలజీని సమకూర్చుకుంటూ.. తమ సేవలను మరితంగా సరళతరం చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక డైమండ్ అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
బ్యాంకింగ్ రంగంలో ఐదు విభాగాల్లో వీటిని అందజేశారు. ఇందుకోసం హిటాచ్చి డేటా సిస్టమ్, ఐడీసీ, గర్ట్‌నర్ సంస్థకు చెందిన నిపుణులను న్యాయ నిర్ణేతలుగా వ్యవహించారు. 70 దేశాల నుంచి మొత్తం 133 నామినేషన్లు వచ్చాయి. పబ్లిక్ ఓటింగ్, జడ్జీల తీర్పు అనుగుణంగా విజేతలను ఈనెల 11వ తేదీన ప్రకటించినట్టు హిటాచ్చి డేటా సిస్టమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.