ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసిన ఆలివ్ టెలికాం (Olive Telecom | Launch | 3G pad | OlivePad-VT100 | Smartphone)
Bookmark and Share Feedback Print
 
దేశంలో త్వరలో రానున్న 3జీ సేవలను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ వైర్‌లెస్ డివైజ్‌ల తయారీ సంస్థ ఆలివ్ టెలికాం "ఆలివ్‌ప్యాడ్-వీటీ100" పేరుతో ఓ సరికొత్త ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసింది. దేశీయ మార్కెట్‌లో దీని ధర రూ. 25,000గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్ పీసీ నెట్‌బుక్, మొబైల్ ఫోన్, 3.5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫ్లాష్ సపోర్ట్, మీనీ యూఎస్‌బీ పోర్టు, కెమెరా, స్మార్ట్‌ఫోన్ వంటి సదుపాయాలున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే నెల నుంచి ఇది మోర్కెట్‌లోకి రానుంది.

ఆలివ్‌ప్యాడ్-వీటీ100 అధికారికంగా విడుదల చేసిన తర్వాత మొదటి ఆరు నెలల్లో లక్ష యూనిట్లను విక్రయం అవుతాయని కంపెనీ ఆశిస్తుంది. గుర్గావ్‌లో ఆలివ్ కంపెనీ తమ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. తమ విశృత శ్రేణి ఉత్పత్తుల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 250 మిలియన్ డాలర్ల టర్నోవర్‌ను సాధిస్తామని కంపెనీ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.