ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » ఫేస్‌బుక్‌పై నిషేదం విధించాలి: పాకిస్థాన్ పిటిషన్ (Petition | Ban | Facebook | Pakistan | Anti Islam)
Bookmark and Share Feedback Print
 
ఇస్లాం మతంపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపనలపై ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ "ఫేస్‌బుక్" సర్వీసులను శాస్వతంగా నిలుపుదల చేయాలని పాకిస్థాన్ అధికారులను కోరుతూ జమాత్-ఉద్-దావ్ అనే సంస్థ కోర్టులో పిటషన్ దాఖలు చేసింది.

న్యాయ ఆచరణతత్వ సంఘం ఛైర్మన్ మహమ్మద్ అజ్‌హర్ సిద్ధక్వి, జస్టిస్ ఇజాజ్ అహ్మద్ చౌదరిల ఆద్వర్యంలో పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీను ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేస్తూ లాహోర్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సిద్ధిక్వి దాఖలు చేసిన పిటిషన్‌లో ఫేస్‌బుక్ వెబ్‌సైటులో "ఎవ్రిబడీ బర్న్ ఖురాన్ డే" అనే పేరుతో ఉన్న పేజీలో మత దూషణ చేశారని, "ఖనా-ఈ-కాబ"కు చెందిన దైవ దూషణ చిత్రాలను పోస్టు చేశారని పేర్కోన్నారు. దీనిపై కోర్టు వెంటనే స్పందించి సదరు వెబ్‌సైటును శాస్వతంగా నిలిపివేయాలని ఆయన కోరారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.