జపాన్‌కు చెందిన "యాహూ జపాన్ కార్పోరేషన్" ఇకపై తమ సొంత సెర్చ్ ఇంజీన్ స్థానంలో గూగుల్‌కు చెందిన సెర్చ్ ఇంజీన్‌ను ఉపయోగించనుంది. ఈ నిర్ణయాన్ని బుధవారం యాహూ జపాన్ ప్రకటించింది. ఇందుకోసం కాలిఫోర్నియాలో ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది.
జపాన్‌లో చాలా వరకు ఇంటర్నెట్ యూజర్లు యాహూ సెర్చ్ కన్నా గూగుల్ సెర్చ్ ఇంజీన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్న కారణంగా యాహూ కంపెనీ, గూగుల్‌తో కలసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వ్యయ నియంత్రణలో భాగంగా తమ సొంత సెర్చ్ ఇంజీన్‌ను, ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ సెర్చ్ ఇంజీన్ బింగ్ నుంచి తీసుకున్న సర్వీసులను నిలిపివేస్తున్నట్లు యహూ తెలిపింది.