ఫేస్‌బుక్‌కు పోటీగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైటు: గూగుల్
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజీన్ గూగుల్, మరో సరికొత్త సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైటును రూపొందిచటానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ దూసుకు పోతుండటంతో ఈ వెబ్‌సైటుకు పోటీగా మరో సైట్‌ను తెచ్చేందుకు పలు ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలతో, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లతో చర్చిస్తోంది.
ఇందుకోసం గూగుల్ సంస్థ టాప్ డెవలపర్లైన ప్లేడమ్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ప్లేఫిష్‌క, జింగా గేమ్ నెట్‌వర్క్ వంటి సంస్థలతో కొత్త సేవలను ప్రారంభించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. కాగా.. ఇప్పటికే గూగుల్ ఆర్కుట్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రపంచ వ్యప్తంగా దీనికి అంత ఆదరణ లభించక పోవడంతో గూగుల్ మరో సరి కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను తయారు చేయాలని భావిస్తోంది.