ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » టెలికాం కంపెనీలలో మొదటి స్థానంలో ఎయిర్‌టెల్!! (Bharti Airtel | Telecom Company | Survey | Voice and Dat)
Bookmark and Share Feedback Print
 
టెలికాం సేవలు అందించే సంస్థ ఎయిర్‌టెల్ 2009-10 సంవత్సరానికి గానూ ఉన్న మొత్తం ఆపరేటర్లలో 37.1శాతం వృద్ధిని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. వాయిస్ అండ్ డేటా నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న టాప్ 10 టెలికాం ఆపరేటర్లలో అధిక వృద్ధిని సాధించి 2009-10 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 38,800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి మొదటి స్థానంలో ఉండగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వార్షిక ఆదాయాల్లో 14శాతం నష్టాన్న చవిచూసి మొత్తం ఆదాయం రూ. 30,240 కోట్లుగా నమోదు చేసుకుని రెండవ స్థానంలో ఉంది.

ఇకపోతే వొడాఫోన్ 13.7శాతం వృద్ధిని సాధించి కంపెనీ ఆదాయాలను రూ. 23,200 కోట్లతో మూడవ స్థానంతో ఉండగా, 3.5శాతం వృద్ధితో రూ. 22,130 కోట్ల ఆదాయంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నాల్గవ స్థానంలో ఉండగా, తరువాతి స్థానాలలో వరుసగా ఐడియా సెల్యూలర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా టెలీ సర్వీసెస్‌లు 5, 6, 7 స్థానాల్లో నిలిచి రూ. 11,390 కోట్లు, రూ. 11,000 కోట్లు, రూ. 6,500 కోట్లుగా నమోదయ్యింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.