ప్రముఖ ఐటీ దిగ్గజం, కంప్యూటర్ల తయారీ సంస్థ హెవ్లెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ) సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మార్క్ హర్డ్ తన పదవికి రాజీనామా చేశారు. తనపై ఆరోపించబడిన లైంగిక వేదింపుల కేసులో విచారణ అనంతంరం మార్క్ రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది.
కాగా.. మార్క్ హర్డ్ స్థానంలో తాత్కాలిక సీఈఓగా అదే కంపెనీలో పని ఛీఫ్ ఫైనానషియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)గా పని చేస్తున్న కాథీ లెస్‌జాక్‌ను నియమించనున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఏదేమైనా ఈ విషయంలో మార్క్‌పై లైంగిక వేదింపులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు రుజువ్వలేదని కాకపోతే కంపెనీ నియమ నిబంధనలను ధిక్కారించాడని కంపెనీ తెలిపింది. మార్క్ హర్డ్ 2005లో హెచ్‌పీ సీఈఓగా నియమితులయ్యారు.