ఇకపై రేషన్ కార్డుల సవరణ కోసం రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగనవసరంలేదు. సాధారణంగా రేషన్ కార్డుల్లో అదనంగా కొత్త సభ్యులను చేర్చాలాన్నా, చిరునామాలో మార్పులు చేయాలన్నా, ప్రచురించిన పేర్లలో అక్షర దోషాలను సవరించాలన్నా సంబంధింత ఆఫీసులకు వెళ్లి రోజులు తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం లేదు.
ఇక నుంచి ఇటువంటి సమస్యలను ఇంటర్నెట్‌లోనే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ వ్యవస్థను పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు సోవమారం ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు వ్యవస్థలో ఏపీ ఆన్‌లైన్, ఈ సేవా కేంద్రాల ద్వారా సదరు పౌరులు రేషన్ కార్డుకు సంబంధించిన తమ సవరణలను చేసుకోవచ్చు.
రేషన్ కార్డులలో కొత్తగా చేసే ఈ మార్పులను పౌర సరఫరాల సిబ్బంది పరిశీలించిన తర్వాత జిల్లాల జాయింట్ కలెక్టర్ ఆమోదం తెలుపుతారు ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి.