ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » "స్లైడ్‌"ను కొనుగోలు చేసిన గూగుల్!! (Internet | Google | Acquire | Slide | Facebook)
Bookmark and Share Feedback Print
 
అంతర్జాల దిగ్గజం గూగుల్ సోషల్ నెట్‌వర్కింగ్‌ అప్లికేషన్‌లను తయారు సంస్థ "స్లైడ్‌"ను 182 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్లైడ్‌ ఒక సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైటును గూగుల్‌కు తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన స్లైడ్ ఐఎన్‌సీ ఇప్పటికే "ఫేస్‌బుక్" అప్లికేషన్లయిన సూపర్‌పోక్, ఫన్‌స్పేస్ వంటి వాటిని తయారు చేసింది. కొత్తగా తయారు చేసే ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైటు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న "ఫేస్‌బుక్"కు గట్టి పోటీ ఇవ్వనుందని గూగుల్ విశ్వసిస్తుంది. ఇదే విషయంలో గూగుల్ గతంలో ఫేస్‌బుక్‌కు పోటీగా ఓ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైటును తయారు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.