ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » అనవసర మార్కెటింగ్ ఫోన్ కాల్స్‌కు డీఎన్‌సీనే పరిష్కారం! (Marketing Phone Calls | DNC | Pranab Mukherjee | Mobile Phones)
అనవసర మార్కెటింగ్ ఫోన్ కాల్స్‌కు డీఎన్‌సీనే పరిష్కారం!
ఇటీవల ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకు గృహ రుణాన్ని అందిస్తామంటూ ఓ టెలిమార్కెటింగ్ కంపెనీ నుంచి కాల్ దేశంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఇటువంటి అనవసరమైన ఫోన్‌కాల్స్‌ను నివారించే అంశంపై చర్చించడానికి టెలికాం కార్యదర్శి పి.జె.థామస్ పలు టెలికాం కంపెనీలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో.. మొబైల్ ఫోన్ వినియోగదారులకు పలు బహుళజాతి కంపెనీలు, సంస్థల నుంచి వచ్చే అనవసర మార్కెటింగ్ కాల్స్, సంక్షిప్త సందేశాల(ఎస్ఎమ్ఎస్)ను నివారించడానికి "డు నాట్ కాల్"(డీఎన్‌సీ) రిజిస్ట్రీపై చందాదారుల్లో అవగాహన పెంచడమే పరిష్కార మార్గమని టెలికాం కంపెనీలు అభిప్రాయపడ్డాయి.
ఇటువంటి కాల్స్‌ను నివారించడం తమ చేతుల్లో లేదని తెలిపాయి. "డు నాట్ కాల్"(డీఎన్‌సీ)కు రిజిస్టర్ చేసుకోవడమే మార్గమని టెలికాం కంపెనీలు థామస్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ డీఎన్‌సీపై రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు ఇటువంటి మార్కెటింగ్ కాల్స్ రావు.