భారత మొబైల్ మార్కెట్‌లో 54శాతం వాటా కలిగి ఉన్న నోకియా అనీల్ అంబానీకు చెందిన రిలయన్స్ కమయూనికేషన్స్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు సంస్థలు రూరల్, సబర్బన్ ప్రాంతాల్లోని ఉన్న వినియోగదారులకు కు మెరుగైన సేవలు అందించటానికి కంకణం కట్టుకున్నాయి.
రూరల్, సబర్బన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు నాణ్యత కలిగిన మొబైల్స్ ఫోన్లను అందించటంలో నోకియా, అక్కడి వినియోగదారులకు మెరుగైన టెలికాం సేవలు అందించటంలో రిలయన్స్‌లు ఈ భాగస్వామ్యం ద్వారా ప్రముఖ పాత్ర పోషించనున్నాయి.
ఈ ప్రాంతాలలో వినియోగదారులకు అత్యున్నత టెలికాం సేవలు అందించడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని నోకియా తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం స్పెషల్ డేటా ప్యాకేజీలు కలిగిన జీపీఆర్‌ఎస్ ఫోన్లను వినియోగదారులకు నోకియా అందించనుంది. ఇకపోతే.. 1.2జీబీ సామర్ధ్యం కలిగిన అంతర్జాల (ఇంటర్నెట్) సౌకర్యాన్ని రిలయన్స్ కల్పిస్తుంది.