ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » మధ్యప్రదేశ్ నుంచి టీసీఎస్‌కు రూ. 150కోట్ల కాంట్రాక్టు (Madhya Pradesh | e-governance contract | Tata Consultancy Services | TCS)
Bookmark and Share Feedback Print
 
దేశంలో ఐటీ సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి భారీ ఆర్డరును దక్కించుకుంది. ఈ ఆర్డరులో భాగంగా మధ్యప్రదేశ్‌ రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ డెవలప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ. 150 కోట్లు.

ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా రెవిన్యూ శాఖ ఫైనాన్సియల్ డీల్స్‌ను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి ప్రభుత్వానికి వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం కోసం అనేక కంపెనీలు పోటీపడగా... ఇన్ఫోసిస్ కన్నా తక్కువ బిడ్డింగ్‌ వేయడంతో ఈ కాంట్రాక్టును టీసీఎస్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ 21.93శాతం వృద్ధిని సాధించి నికర లాభాలను రూ.1,556.41 కోట్లుగా నమోదు చేసుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.