ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » భారత నంబర్ వన్ సోషల్ నెట్‌వర్క్ సంస్థగా ఫేస్‌బుక్ (Social Networking Sites | FaceBook | Number One | Internet | Orkut | Google)
Bookmark and Share Feedback Print
 
యావత్ ప్రపంచం ఇప్పుడు సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్లపైనే దృష్టి సారించింది. వృత్తి, వ్యారపారం, విద్యా, వైద్యం.. ఇలా రకరకాల బ్లాగులు, సైట్లు. ఈ తరుణంలో పెద్ద పెద్ద కంపెనీలకు సైతం పోటీ తప్పడం లేదు. పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల వల్ల పలు ప్రముఖ కంపెనీల వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పడు ఈ కోవలోకి గూగుల్ కూడా చేరిపోయింది.

అంతర్జాల(ఇంటర్నెట్) దిగ్గజంగా పేరొందిన గూగుల్ అత్యంత ప్రతిష్ట్మాకంగా రూపొందించిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ "ఆర్కుట్". ఒకప్పుడు భారత నంబర్ వన్‌ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌గా ఉన్న ఆర్కుట్ ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. సోషల్ నెట్‌వర్కింగ్ పోటీ మార్కెట్‌లో ఆర్కుట్ యాహూలను సైతం అధికమించి "ఫేస్‌బుక్" నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

గత ఏడాదితో పోలిస్తే జూలైలో ఫేస్‌బుక్‌ను వినియోగించిన వారి సంఖ్య 179శాతం వృద్ధని సాధించి 2.09 కోట్లకు చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇదే సమయానికి ఆర్కుట్ 16శాతం మాత్రమే వృద్ధిని సాధించి 1.99 కోట్ల మంది యూజర్లను నమోదు చేసుకుని ద్వితీయ స్థానంలో ఉన్నట్లు ప్రముఖ రీసెర్చ్ సంస్థ కామ్‌స్కోర్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాలలో భారత్‌స్టూడెంట్స్(44 లక్షల యూజర్లు), ట్విట్టర్(33 లక్షల యూజర్లు) ఉన్నట్లు కామ్‌స్కోర్ పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.