ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » అనవసర మార్కెటింగ్ కాల్స్ చేస్తే ఊరుకోం..: సుప్రీం కోర్టు (Marketing Calls | Supreme Court | Do Not Call | DNC)
Bookmark and Share Feedback Print
 
వినియోగదారులు కోరుకోకుండానే వివిధ సంస్థలు అనవసరంగా చేసే మార్కెటింగ్(ప్రకటనలు) కాల్స్‌పై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఈ మేరకు భారత నంబర్ వన్ టెలికాం సంస్థ అయిన భారతి ఎయిర్‌టెల్‌, జీఎస్‌ఎం లాబీ సంస్థ సీఓఏఐ, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందిన ఎనిమిది వారాల్లోగా బదులివ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇటీవల ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకు గృహ రుణాన్ని అందిస్తామంటూ ఓ టెలిమార్కెటింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చిన నేపథ్యంలో ఇటువంటి అనవసరమైన ఫోన్‌కాల్స్‌ను నివారించే అంశంపై సుప్రీం కోర్టు కన్నేసింది.

కానీ.. టెలికాం కంపెనీలు మాత్రం ఇటువంటి కాల్స్‌ను నివారించడం తమ చేతుల్లో లేదని చేతులెత్తేస్తున్నాయి.. దీనికి "డు నాట్ కాల్"(డీఎన్‌సీ)కు రిజిస్టర్ చేసుకోవడమే మార్గమని టెలికాం కంపెనీలు అంటున్నాయి. ఈ డీఎన్‌సీపై రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు ఇటువంటి మార్కెటింగ్ కాల్స్ రావు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.