ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » టెక్ మహీంద్రా సీఈఓ సంజయ్ కల్రా రాజీనామా! (Tech Mahindra | CEO | Sanjay Kalra | Quits | Resigne | IT | Anand Mahindra)
Bookmark and Share Feedback Print
 
ప్రముఖ ఐటీ దిగ్గజం "టెక్ మహీంద్రా" ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సంజయ్ కల్రా తన పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. సంజయ్ కల్రా గత ఆరేళ్లుగా టెక్ మహీంద్రాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న వినీత్ నయ్యర్, సంజయ్ కల్రా స్థానంలో సీఈఓ నిర్వహణ బాధ్యతలను చెపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

సంజయ్ కల్రా సీఈఓ బాధ్యతలు చేపట్టక ముందు గత ఏడాది వరకూ వినీత్ నయ్యర్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసినట్లు కంపెనీ తెలిపింది. "టెక్ మహీంద్రా అభివృద్ధిలో సంజయ్ ప్రముఖ పాత్ర పోషించారు. కంపెనీ బోర్డు కూడా అతను సంస్థకు చేసిన సేవలను గుర్తించింది" అని టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.