గూగుల్ చేతికి సోషల్ నెట్‌వర్కింగ్ స్టార్టప్ "ఆంగ్‌స్ట్రో"
ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం "గూగుల్" మరో అప్లికేషన్‌ను కొనుగోలు చేసింది. పాల్ ఆల్టోకు చెందిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ స్టార్టప్ "ఆంగ్‌స్ట్రో"ను గూగుల్ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌లో ఫోటోలను వెతకడానికి లింక్డ్‌ఇన్ ఫ్రోఫైల్స్‌ను కాలర్ ఐడితో కలుపడానికి, ట్విట్టర్‌కు సంబధించిన మరికొన్ని సోషల్ నెట్‌నర్కింగ్ వెబ్‌సైట్ల అప్లికేషన్లను ఇది అందిస్తుంది.
అమెరికా కేంద్రంగా సెర్చ్ ఇంజన్‌ను నడిపిస్తున్న గూగుల్ ఇంటెర్నెట్ మార్కెట్‌లో మూడొంతుల వాటాను కలిగి ఉంది. అయితే ఈ ఒప్పందంపై మట్లాడటానికి గూగుల్ నిరాకరించింది. గూగుల్ నుంచి త్వరలో కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ అప్లికకేషన్ రానున్న నేపథ్యంలో ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు సమాచారం. గూగుల్ సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా చిన్న చిన్న కంపెనీలు కొనుగోలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.