ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » "స్కైపీ"ను కొనుగోలు చేయటానికి "సిస్కో" సన్నాహాలు?! (Cisco | Skype | Internet telephone calls | video calls | networking hardware)
"స్కైపీ"ను కొనుగోలు చేయటానికి "సిస్కో" సన్నాహాలు?!
ఇంటర్నెట్ టెలిఫోన్ కాల్స్ సేవలు అందించే ప్రముఖ ఐటీ సంస్థ "స్కైపీ"ను కొనుగోలు చేయటానికి అమెరికాకు చెందిన నెట్‌వర్క్ సేవల సంస్థ "సిస్కో" బిడ్‌ను దాఖలు చేసింది. దాదాపు 5 బిలియన్ అమెరికన్ డాలర్లకు సిస్కో ఈ బిడ్‌ను దాఖలు చేసినట్లు ఓ బ్లాగ్‌లో తెలిపింది.
స్కైపీ అప్లికేషన్ యూజర్లకు ఉచిత ఇంటర్నెట్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా.. వీడియో కాలింగ్, మొబైల్ ఫోన్లకు, ల్యాండ్ ఫోన్లకు తక్కువ ధరలకే అంతర్జాతీయ టెలి కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. అయితే ఇటీవలే గూగల్ ఇలాంటి వ్యవస్థనే తమ మెయిలింగ్ సిస్టమ్ అయిన జీమెయిల్‌లో కల్పిస్తున్నామని ప్రకటించడంతో పోటీ తట్టుకోలేక కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత 2005లో స్కైపీను "ఈబే" 2.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించగా.. 2009లో తిరిగి స్కైపీ వ్యవస్థాపకుడు 1.9 బిలియన్ అమెరికన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ నెట్‌వర్కింగ్ హార్డవేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న సిస్కో సమచార వ్యవస్థను అభివృద్దధి చేయటం చరకైన పాత్రను పోషిస్తుంది. ఈ కొనుగోలుతో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.