ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » విప్రో సీఎస్ఓగా ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషాద్ ప్రేమ్‌జీ! (Wipro | IT Companies | Chairman | Azim Premji | Rishad Premji | CEO)
Bookmark and Share Feedback Print
 
భారతదేశపు సాఫ్ట్‌వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన విప్రో సంస్థలోని ఓ కీలక విభాగానికి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషాద్ ప్రేమ్‌‌జీ సీఎస్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. విప్రోలోని ఓ ఐటి విభాగానికి చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్ఓ) రిషాద్ ప్రేమ్‌‌జీ నియమితులైనట్లు కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుతం రిషాద్ ప్రేమ్‌‌జీ ట్రెజరీ అండ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీఎస్ఓగా వ్యవహరిస్తున్న కెఆర్ లక్ష్మినారాయణ... ప్రేమ్‌జీ ట్రస్ట్ చీఫ్ ఎండోమెంట్ ఆఫీసర్‌గా బదిలీ అవడంతో ఈ బాధ్యతలను రిషాద్ ప్రేమ్‌‌జీకు అప్పగించినట్లు కంపెనీ తెలిపింది.

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన రిషాద్ జీఈ క్యాపిటల్, బెయిన్ అండ్ కో కన్సల్టెన్సీలలో పని చేశారు. గత 2007వ సంవత్సరంలో విప్రో చేరారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.