ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » ఆపిల్ ఐపాడ్‌కు పోటీగా స్యామ్‌సంగ్ "గెలాక్సీ ట్యాబ్" (Samsung Electronics | Tablet Computer | Galaxy Tab | Apple iPad)
Bookmark and Share Feedback Print
 
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ "స్యామ్‌సంగ్" మొదటిసారిగా టాబ్లెట్ పీసీని విడుదల చేయనుంది. ఇప్పటి వరకూ మొబైల్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్ వంటివి అందిస్తుండగా.. తాజాగా టాబ్లెట్ పీసీ విభాగంలోకి స్యామ్‌సంగ్ ప్రవేశించింది. ఇటీవల ఆపిల్ నుంచి వచ్చిన టాబ్లెట్ పీసీ(9" ఐపాడ్)కు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రపంచ మార్కెట్‌లోకి టాబ్లెట్ పీసీను విడుదల చేయనుంది.

"గెలాక్సీ ట్యాబ్" పేరుతో మరో రెండు వారాల్లో ఈ టాబ్లెట్ పీసీ మార్కెట్‌లో ప్రత్యక్షం కానుంది. ఇటువంటి ఉత్పత్తులకు అధిక మార్కెట్ ఉంటుందని స్యామ్‌సంగ్ మొబైల్ మార్కెటింగ్ హెడ్ వైహెచ్ లీ తెలిపారు. గత నెలలో డెల్ సంస్థ "డెల్ స్ట్రీక్" పేరుతో అమెరికా వినియోగదారుల కోసం ఓ టాబ్లెట్ పీసీను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ గెలాక్సీ ట్యాబ్ ధరలోనూ, వెడల్పులోనూ, ఫీచర్లలోనూ ఐపాడ్‌కు మంచి పోటీ ఇవ్వనుంది. ఇది 7 అంగుళాల టచ్ స్క్రీన్‌ను, 380 గ్రాముల బరువును కలిగి ఉండి గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

ఇంకా.. హెచ్‌టీఎమ్ఎల్5, అడోబ్ ఫ్లాష్ ప్లేయర్, బ్లూటూత్, వై-ఫై, 3జీ సెల్ ఫోన్ నెట్‌వర్క్, 3 మెగా పిక్సెల్ డిజిటల్ కెమరా (ఫ్లాష్‌తో సహా), వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాలింగ్ కోసం ముందువైపు మరో కెమెరాను కలిగి ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.