ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » గూగుల్ చేతికి సోషల్‌ గేమ్స్ వెబ్‌సైట్‌ "సోషల్ డెక్" (Google, Acquire | Social Games Website | SocialDeck | Internet)
Bookmark and Share Feedback Print
 
ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌‌లలో అగ్రగామిగా ఉన్న గూగుల్ ఇటీవల ఆంగ్‌స్ట్రోను కొనుగోలు చేసి రెండు రోజులు కూడా గడవక ముందే మరో సంస్థను తమ ఖాతాలోకి చేర్చుకుంది. కెనడాకు చెందిన సోషల్‌ గేమ్స్ వెబ్‌సైట్‌ "సోషల్‌ డెక్‌"ను గూగుల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న పోటీ మార్కెట్‌లో తమ సోషల్‌ నెట్‌వర్కును మరింత బలోపేతం చేసేందుకు సోషల్ గేమింగ్‌ వైబ్‌సైట్‌ కొనుగోలు చేసింది.

ఇదంతా చూస్తుంటే.. గూగుల్ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ "ఫేస్‌బుక్"కు బలమైన పోటీ ఇవ్వడానికి ఇటీవల కాలంలో సోషల్ నెట్‌వర్క్ మార్కెట్‌పై మరింత దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సోషల్ డెక్‌ను ఎంత మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి ఇరు కంపెనీలు ప్రస్తావించలేదు. సోషల్ డెక్ వెబ్‌సైట్‌లో మాత్రం తమ సంస్థను గూగుల్ కొనుగోలు చేసినట్లు ప్రచురిచింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.