ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  ఏపీ న్యూస్
 
తెదేపా పొలిట్‍బ్యూరోలోకి కొత్త సభ్యులు
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పొలిట్‌బ్యూరోలోకి కొత్త సభ్యులను ఎంపిక చేసే దానిపై పార్టీ కసరత్తు చేస్తుంది. ఇందులో పార్టీ నేట చంద్రబాబు నాయుడుతో పాటుగా దేవేందర్ గౌడ్, యమనల రామకృష్ణుడు, ఎర్రంనాయుడు తదితరులు గురువారం సమావేశమయ్యారు.

కొత్తగా పొలిట్‌బ్యూరోలోకి ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను చేర్చుకునేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అలాగే పొలిట్‌బ్యూరోలో స్వల్ఫ మార్పులతో సరిపెట్టాలని పార్టీ భావిస్తోంది.

పొలిట్‌బ్యూరోలో ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణ బలరామకృష్ణమూర్తి, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, అల్లాడి రాజకుమార్‌లను తప్పించి పార్టీలోని ఇతర సీనియర్ నేతలకు అందులో అవకాశమివ్వాలని పార్టీ ఆలోచనలో ఉంది.

అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శులైన ముళ్లపూడి రేణుక, సయ్యద్ యూసఫ్ ఆలీ, చింతకాయల అయ్యన్నపాత్రుడులను తొలగించే ఆలోచనలో కూడా ఉంది.
మరిన్ని
610 జీఓపై అమలుపై సిఎం మాటకు కట్టుబడాలి: దత్తాత్రేయ
తెదేపా నేతల క్షమాపణకు పొన్నాల డిమాండ్
రుద్రాక్షపల్లి నరహంతకులకు 21 ఏళ్ళ జైలుశిక్ష
రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు: రఘువీరా
పట్టాలు తప్పిన నాగర్ కోయిల్ : పలు రైళ్లు రద్దు
స్కాలర్‌షిప్‌ల కుంభకోణం: 18 మందికి జైలు