ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  ఏపీ న్యూస్
 
ఆ జీవోను కూడా రద్దు చేయాలి: కేసీఆర్
తెలంగాణా రాష్ట్ర ప్రాంతాలకు సాగునీటి పంపిణీలో అన్యాయం జరిగేలా ప్రభుత్వం జారీ చేసిన 34ను తక్షణం రద్దు చేయాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. సాగునీరు పంపిణీలో తెలంగాణా ప్రాంతాలకు అన్యాయం చేసేందుకే ఈ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు కావాలనే తెలంగాణా ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే బిందు సేద్యం విధానాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. నాలుగు లక్షల గుంతలు తవ్వి 44 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం సాధ్యమేనా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మరిన్ని
ఎంసీఐతో చర్చలు జరుపుతాం: వైఎస్సార్
ఆదివారం రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు మూత
రాష్ట్రంలో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలు : రాజ్యలక్ష్మీ
నేటి నుంచి చిత్రోత్సవ్ ప్రారంభం
నేడు సీఎం గుంటూరు జిల్లాలో పర్యటన ప్రారంభం
యూరో లాటరీ కేసు: కోలా కృష్ణమోహన్‌కు జైలు