రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన జిల్లాల ప్రజలకు చేయందిస్తామని ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆయా జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో పర్యటిస్తున్న ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
వరదలకు దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇస్తామని తెలిపిన ఆయన వర్షాలుతో మృతి చెందిన వారి కుంటుంబాలకు సహాయక నిధిని ప్రకటించిన విషయం గుర్తుచేశారు.
వరదలో భారీ ప్రాణ, ఆస్థి నష్టాన్ని ఎదుర్కొన్న కర్నూలు జిల్లాను పర్యటించిన వైఎస్ లోతట్టు ప్రాంతాల్లో బ్రిడ్జిలను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. వరద బాధితులను తాము పూర్తిగా ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
|