భూపోరాట ఉద్యమంపై ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సీపీఎం నల్గొండ జిల్లాలో బంద్ చేపట్టింది. ప్రశాంతంగా జరిగే ఈ బంద్‌లో టీడీపీ, తెరాసలు కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యక్తలు మంగళవారం ఉదయం దుకాణాలు మూయించి, బస్సులు వెళ్లకుండా అడ్డుకుని బంద్‌ను ప్రారంభించారు.
కాగా నల్గొండలో పలువురు టీడీపీ, సీపీఎం కార్యక్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కోదాడ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న సీపీఎం కార్యక్తలకు, పోలీసులకు మధ్య ఘర్షన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో సుమారు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా మిర్యాల గూడ, సూర్యాపేట ప్రాంతాలలో బంద్ నిర్వహిస్తున్న సుమారు 250 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు సీపీఎం వర్గాలు పేర్కొంటున్నాయి.
|