ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  ఏపీ న్యూస్
 
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అమెరికా కాన్సులేట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అమెరికా ప్రతినిధులకు మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో సంబంధిత అధికారులు సంతకాలు చేశారు. అమెరికా తాత్కాలిక కాన్సులేటు కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేస్తారు.

ఈ అమెరికా కాన్సులేటులో 2008 నుంచి వీసా ప్రాసెసింగ్ పనులు చేపడతారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం అమెరికా 30 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన వివరించారు. అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు సమీపంలోని గచ్చిబౌలిలో పది ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యాలయం ఏర్పాటు వల్ల వీసాలకు దరఖాస్తులు చేసుకుని, వాటిని పొందడం రాష్ట్ర ప్రజలకు సులభం అవుతుంది. రాష్ట్రానికి చెందినవారు ఇప్పుడు వీసా ప్రాసెసింగు కోసం చెన్నై వెళ్తున్నారు.
మరిన్ని
'తాజ్‌మహాల్' ఓటింగ్‌ కోసం విన్నూత్న ప్రచారం
శాసనసభ ఎన్నికల్లో లోక్‌సత్తా పోటీ: జయప్రకాష్
మదనపల్లిలో కాశ్మీర్ తీవ్రవాది అరెస్టు
610 జీవో అమలుకు కట్టుబడి ఉన్నాం: వైఎస్సార్
సచివాలయాన్ని ముట్టడించనున్న తెరాస
ఆరో తేదీతో ముగియనున్న 'న్యూ 7-వండర్స్' ఓటింగ్