ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
రాష్ట్రంలో నిండుతున్న రిజర్వాయర్లు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పలు రిజర్వాయర్ల నుంచి నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. ఇలా కృష్ణానదిలోకి అదనంగా వచ్చిచేరుతున్న నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ఇలా మొత్తం సుమారుగా 1.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలసిపోయింది.

ఎగువన ఉన్న నాగార్జున సాగర్ ఆనకట్ట నుంచి 1.65 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు వదిలారు. ఇందులో దాదాపు 11,278 క్యూసెక్కుల నీటిని పంట సాగుబడి కోసం సాగునీటి కాల్వలకు వదిలారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఉన్న 70 క్రస్ట్ గేట్లను ఒక్కసారి ఎత్తివేయడంతో కృష్ణా జలాలు నురగలు కక్కుతా ప్రవహిస్తున్నాయి. ఈ రమణీయ దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో ప్రకాశం బ్యారేజికి చేరుకున్నారు.
మరిన్ని
ముస్లీం రిజర్వేషన్లపై ఏబీవీపి ఆందోళన
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: వైఎస్సార్
ఆసమ్మతి నేత పీజేఆర్ దీక్ష వాయిదా
అసెంబ్లీలో ‘భూ’కంపం తప్పదు: రాఘవులు