వచ్చే సెప్టెంబర్ నెల నుంచి ఓటరు గుర్తింపు కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఫొటోలు తీసి ఓటర్ల జాబితా తయారు చేయాలని మండల రెవెన్యూ కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఫొటోగ్రాఫ్‌ల స్కానింగ్, డేటా ఎంట్రీ, మార్పులు వంటి వాటిని వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు చేపట్టాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. మార్చి ఒకటో తేదీన ఓటర్ల జాబితా ప్రకటించి, అభ్యంతరాల స్వీకరణ, నమోదు, పరిశీలన వంటివి పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకు కొత్త ఎలక్ట్రానిక్ ఓటరు కార్డులను పంపిణీ చేయాలని సూచించింది.
|