ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
దాడులకు వెరవను: రచయిత్రి నస్రీన్
తనపై దాడులు జరిగినంత మాత్రానా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పష్టం చేశారు. నేను ప్రజాస్వామ్యానికి కంకణ బద్ధురాలునై జీవనం సాగిస్తున్నాను. లక్షలాది మంది ప్రజల అండదండలు, ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. ఈ సమాజంలో మానవతా విలువల కోసం పోరాడటం నా నైజంగా భావిస్తున్నాను అని నస్రీన్ కోల్‌కతాకు చేరుకున్న తర్వాత విలేకరులతో ఉన్నారు.

గురువారం హైదరాబాద్‌కు వచ్చిన నస్రీన్‌పై మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడి నుంచి సురక్షింతంగా బయటపడిన నస్రీన్ వెంటనే తాను నివాసముంటున్న కోల్‌కతాకు చేరుకున్నారు. అయితే తనపై జరిగిన దాడి పట్ల నస్రీన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

ఇదిలావుండగా తస్లీమాపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు కల్పిస్తున్న భద్రతపై సమీక్షించనున్నట్టు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. నస్రీన్‌కు ఇప్పటికే గట్టి భద్రతను కల్పిస్తున్నామని, దాడి నేపథ్యంలో ఈ భద్రతను సమీక్షించనున్నట్టు బెంగాల్ హోం శాఖ కార్యదర్శి రాయ్ తెలిపారు.
మరిన్ని
తస్లీమాపై దాడి అమానుషం: మున్షీ
బంగ్లా రచయిత్రి నస్రీన్‌పై ఎంఐఎం దాడి
తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడిగా హరికృష్ణ
మాజీ మంత్రి, తెదేపా నేతపై దాడి కేసు
అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు 40 శాతం టిక్కెట్లు: బాబు
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం: దిగ్విజయ్