ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
తస్లీమాపై దాడి మానవ హక్కుల ఉల్లంఘన: సుభాషణ్ రెడ్డి
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడి మానవహక్కుల ఉల్లంఘన అని రాష్ట్ర మానవ హక్కుల ఛైర్మన్ సుభాషణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ద్వితీయ వార్షికోవత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నస్రీన్‌పై దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పక్షంలో కేసును సుమోటోగా స్వీకరిస్తామన్నారు.

ఈ దాడి కేసుపై ఎవరు పిటీషన్ వేసిన విచారణకు స్వీకరిస్తామని ఆయన ఈసందర్భంగా వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన బంగ్లాదేశ్ రచయిత్రిపై మజ్లిస్ పార్టీ (ఎంఐఎం)కి చెందిన శాసనసభ్యులు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెల్సిందే. అయితే.. ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడిన నస్రీన్ తాను ఉంటున్న కోల్‌కతాకు చేరుకున్న విషయం తెల్సిందే.
మరిన్ని
బంగ్లా రచయిత్రి నస్రీన్‌పై కేసు నమోదు
మిగులు భూముల వివరాలను ప్రకటించాలి: బీవీ రాఘవులు
డిసెంబర్‌ నుంచి వామపక్షాల రాష్ట్ర మహాసభలు
భూ పోరాటాలను ఆపే ప్రసక్తే లేదు: నారాయణ
ఎంఐఎం ఎమ్మెల్యేలపై కేసుల నమోదుకు భాజపా డిమాండ్
దాడులకు వెరవను: రచయిత్రి నస్రీన్