రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబుపేలుడు సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి ముఖ్య కారణమని భాజపా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో భాగంగా సచివాలయ దిగ్భంధనానికి భాజపా కార్యకర్తలు పట్టుబట్టారు. అంతేకాకుండా సచివాలయం ముందు కార్యకర్తలు బైఠాయించి సచివాలయం లోపలికి ఎవరిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ఈ చర్యతో సచివాలయం ముందు కాసేపటికి ఉద్రిక్తత జరిగింది. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీనితో ప్రభుత్వ అధికారులు సచివాలయానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. భాజపా కార్యకర్తలకు , పోలీసులకు మధ్య జరిగిన తోపులాటను అదుపు చేయలేక పోలీసులు 55 మందికిపైగా కార్యకర్తలను భాజపా మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డిని అరెస్టు చేశారు.
|