ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
భాగ్యనగరి పేలుళ్లు: మరో వ్యక్తి మృతి
గత శనివారం హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో తీవ్రంగా గాపయడిన మరో వ్యక్తి మంగళవారం కన్నుమూశాడు. రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సం పొందుతున్న శ్రీనివాస రావు అనే వ్యక్తి మరణించినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పేలుళ్లు జరిగిన రాత్రి వర్షం పడుతుండంతో.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద నిలబడ్డాడు.

అదే సమయంలో బాంబు పేలుడు జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఈయన కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఈయన మృతితో వరుస బాంబు పేలుళ్ళలో మరణించిన వారి సంఖ్య 43కు చేరుకోగా... మరికొందరి పరిస్థితి అందోళనకరంగా ఉంది.
మరిన్ని
ప్రభుత్వాధినేతగా.. నైతిక బాధ్యత నాదే: వైఎస్
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం: ఇంద్రసేన
శాంతి భద్రతలను పరిరక్షించాలని గవర్నర్‌ను కోరిన తెదేపా
భాగ్యనగరానికి బాంబు బెదిరింపులు
భాజపా బంద్‌తో కదలని బస్సులు
ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలి: బాబు