శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఆదివారం చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-4 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం 4.21 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించక పోవడంతో.. ప్రయోగాన్ని యాభై నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సరిగ్గా 6.20 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-4 రాకెట్ నింగికెగసింది. ఈ ప్రయోగం నిర్వహణ కోసం.. గత శనివారం మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెల్సిందే.
మొత్తం 49 మీటర్ల పొడవు, 415 టన్నుల బరువు, మూడు దశలు గల జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-04 రాకెట్ ద్వారా ఇన్‌శాట్-4సిఆర్ ఉపగ్రహాన్ని రోదసీలో 170 కిలోమీటర్ల ఎత్తున ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో సమాచార ట్రాన్స్‌పాండర్లు ద్వారా డైరెక్ట్ టూ టూ హోమ్ (డీటీహెచ్) టెలివిజన్ సర్వీసులు, విడియో పిక్చర్ ట్రాన్స్ మిషన్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ సేకరణ సేవలు మరిత సులభతరం కానున్నాయి.ఈ ప్రయోగం ద్వారా జీఎస్‌ఎల్వీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెడుతున్నారు.
|