ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి
రాష్ట్రంలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యానులో బాసరకు వెళుతున్న నిజమాబాద్ వాసులను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జగ్గయ్యపేట నుంచి సిమెంటు బస్తాలతో విశాఖపట్నం వెళుతున్న లారీ అదుపుతప్పి కరెంటు స్థంబాన్ని ఢీ కొనడంతో లారీపైన కూర్చున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. తెల్లవారు జామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
మరిన్ని
జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం
బాంబు పేలుళ్లు శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనం: బాబు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: గీతారెడ్డి
భాగ్యనగరి పేలుళ్ళు: ఆస్పత్రిలో బాలుడి మృతి
లష్కర్‌తో బిలాల్‌‌కు‌ ప్రమేయం: పోలీసులు
వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది: వైఎస్