ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
మిగులు భూములను పంపిణీ చేయాలి: నారాయణ
ప్రభుత్వ ఆధీనంలోని మిగులు భూములను పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ నేత నారాయణ మరోమారు డిమాండ్ చేశారు. కృష్ణ జిల్లా పెదపట్నంలో జరిగిన భూపోరాట సదస్సులో ఆయన సోమవారం పాల్గొని ప్రసంగించారు. తమ డిమాండ్ల సాధన కోసం పేదలు చేపట్టిన ఉద్యమాన్ని అణచి వేసేందుకు న్యాయవ్యవస్థ కూడా సహకరించడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అనేక మంది బడా భూస్వాముల వద్ద వేలాది ఎకరాలు మిగులు భూములు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకునేదుంకు ప్రభుత్వం ఒక్క నోటీసు కూడా ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 70 లక్షల ఎకరాల భూములను 35 లక్షల మందికి పంచాలని నారాయణ డిమాండ్ చేశారు. పేదల కోసం వామపక్షాలు చేపట్టిన భూ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.
మరిన్ని
రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి
జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం
బాంబు పేలుళ్లు శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనం: బాబు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: గీతారెడ్డి
భాగ్యనగరి పేలుళ్ళు: ఆస్పత్రిలో బాలుడి మృతి
లష్కర్‌తో బిలాల్‌‌కు‌ ప్రమేయం: పోలీసులు