ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
భాగ్యనగరి పేలుళ్లు: బంగ్లాలో నిందితుడి అరెస్టు
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మక్కా మసీదు వద్ద జరిగిన పేలుళ్లకు సూత్రధారిగా వ్యవహరించడంతో పాటు ఇటీవల జరిగిన వరుస పేలుళ్లలో సైతం వ్యక్తి పాత్ర ఉన్నట్టు సందేహిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాన స్థావరంగా పనిచేసే హుజి అనే తీవ్రవాద సంస్థకు చెందిన మొహమ్మద్ షర్ఫుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు బంగ్లా పోలీసుల నుంచి సమాచారం అందిందని భద్రతా సంస్థ వర్గాలు తెలిపాయి.

హుజి కమాండర్ అబ్దుల్ సాహిద్ మొహ్మద్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో వరుస పేలుళ్లకు షర్పుద్దీన్ పూనుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే అతనిపై రెడ్ కార్నర్ నోటీసు లేకపోవడంతో అతడిని పట్టుకునేందుకై ఇంటర్‌పోల్ ద్వారా సీబీఐ విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
మిగులు భూములను పంపిణీ చేయాలి: నారాయణ
రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి
జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం
బాంబు పేలుళ్లు శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనం: బాబు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: గీతారెడ్డి
భాగ్యనగరి పేలుళ్ళు: ఆస్పత్రిలో బాలుడి మృతి