ఆరోగ్యశాఖలో కొత్తగా మూడు వందల వైద్యుల పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్ ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రకటించిన 369 పోస్టుల భర్తీలతో పాటు, ఖాళీలను భర్తీ చేయాలని అధికారులకు చంద్రశేఖర్ సూచించారు.
సెప్టంబర్ నెలాఖరులో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో 969 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు నెలల కిందట నోటిఫికేషన్ కూడా జారీ అయిందని ఆయన వివరాలందించారు.
ఈ పోస్టులకు రెండు వేల దరఖాస్తులు రాగా వాటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పిన చంద్రశేఖర్, ఆరోగ్యశాఖలోని అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు డిప్యూటీ సివిల్ సర్జన్లుగా పదోన్నతి కల్పించడానికి ఈ నెల ఆరో తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని ఆయన చెప్పారు.
|