ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
8న విశాఖలో బహిరంగ సభ: సీపీఎం
విశాఖపట్నం తీరంలో మంగళవారం ప్రారంభం కానున్న నౌకాదళ సంయుక్త విన్యాసాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన విశాఖలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమీటీలు ప్రకటించాయి. ఈ అంశంపై మంగళవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ నాయకత్వంలో చెన్నైలో, సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ నాయకత్వంలో కోల్‌కతలో విడివిడిగా జాతాలు ప్రారంభమవుతాయని సీపీఎం పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ రెండు జాతాలు ఈ నెల 7న రాష్ట్రంలోకి ప్రవేశించి 8న విశాఖ చేరుతాయని ఆ ప్రకటన పేర్కొంది. తొమ్మిదో తేదీవరకు కొనసాగే ఈ విన్యాసాల్లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, సింగపూర్‌లు పాల్గొనున్నాయి. అదే రోజు సాయంత్రం ప్రారంభం కానున్న ఈ బహిరంగ సభలో రాష్ట్ర సీపీఎం, సీపీఐ నేతలు సీతారామ్ ఏచూరీ, ఆర్ఎస్‌పీ నేత అబనీరాయ్ తదితర నాయకులు పాల్గొననున్నారు.
మరిన్ని
ఆరోగ్యశాఖలోని ఖాళీలు భర్తీ: చంద్రశేఖర్
భాగ్యనగరి పేలుళ్లు: బంగ్లాలో నిందితుడి అరెస్టు
మిగులు భూములను పంపిణీ చేయాలి: నారాయణ
రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి
జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం
బాంబు పేలుళ్లు శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనం: బాబు