రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాల్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాలను భాజపా (భారతీయ జనతా పార్టీ) ఆధ్వర్యంలో గురువారం ప్రారంభింది.
ఉస్మానియా యూనివర్సిటిలోని ఆర్ట్స్ కళాశాల వెలుపటి భాగంలో గోరింటాకు పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా గోరింటాకుతో వినూత్నంగా "విద్రోహంపై విజయం" అనే చేతులకు వేసుకున్నారు. ఈ సంబరంలో మహిళలు, యూనివర్సిటి విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోరింటాకు పెట్టుకున్న వీరు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ పండుగ భాజపా మహిళా మెర్చా ఆధ్వర్యంలో జరిగింది.
|